Share News

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:56 PM

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం పరిగి మండలంలోని పీ నరసాపురం, కొత్తపల్లి, ఎన ముద్దిరెడ్డిపల్లి, బీరేపల్లి, ధనాపురం, శిరేకోళం, హొన్నంపల్లి, జంగాలపల్లి, కే నరసాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న సవిత

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

హిందూపురం అర్బన, మార్చి 27: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం పరిగి మండలంలోని పీ నరసాపురం, కొత్తపల్లి, ఎన ముద్దిరెడ్డిపల్లి, బీరేపల్లి, ధనాపురం, శిరేకోళం, హొన్నంపల్లి, జంగాలపల్లి, కే నరసాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పరిగిలో రోడ్డుషో నిరహించా రు. ఆయా గ్రామాల్లో సవితకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ.... ఒక్క ఛాన్సతో సీఎం జగన రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు నె ట్టాడన్నారు. మరో మారు అధికారం అందిస్తే మన ఆస్తులను సైతం తాకట్టు పె ట్టేస్తారన్నారు. వైసీపీ పాలనలో మండలంలో ఒక్క అభివృద్ధి పని అయినా జరి గిందా అని పశ్నించారు. మాజీ మంత్రి శంకరర్‌నారాయణ పెనుకొండ మండ లంలో దోచుకుని వెళ్లాడన్నారు ఇప్పుడు మరో రెండు వలస పక్షులు వచ్చాయ న్నారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శాంత, ఉష నానలోకల్‌ అన్నారు. తా ను, టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి స్థానికులమన్నారు. టీడీపీ హయాంలో ఇక్కడ ఎంతో అభివృద్థి జరిగిందని, వైసీపీ పాలనలో దాని జాడే లేదన్నారు. భవి ష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ, నాయకులు శిరేకోళం శ్రీనివాస రెడ్డి, వడ్డెర హనుమ య్య, ఈశ్వర, నరసింహులు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

పెనుకొండ టౌన : పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని టీడీపీఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె గురువారం పట్టణంలోని తోటగేరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల్లో కోత, అరాచక పాలనపై సవిత మహిళలకు వివరించారు. అలాగే టీడీపీ మినీ మేనిఫెస్టో, సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. టీడీపీ వార్డు ఇనచార్జ్‌ ఆవుల నరేంద్ర, సామిల్‌ షౌకత, మాజీ వైస్‌ సర్పంచ సుబ్రహ్మణ్యం, పూల శ్రీనివాసులు, మండల మాజీ కన్వీనర్‌ శ్రీరాములు, చంద్రకాంతమ్మ, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:56 PM