Share News

పగలు ఎండ వేడి.. రాత్రి జడివాన

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:47 PM

ఉదయం ఎండ వేడి... రాత్రికి జడివానతో అన్నదాత కుదేలవుతున్నాడు. పంట ఎదుగుదల వచ్చే సమయంలో వర్ష ప్రభావంతో పంటలకు మచ్చతెగులు సోకి పంటను కాపాడుకోలేక పోతున్నారు. ఎన్ని మందులు పిచికారి చేసినా తెగుళ్లు అదుపులోకి రావడం లేదు. ఈ రబీలో కర్బూజ, కళింగర, ట మోటా, బీర, మిరప, వేరుశనగ పంటలు ఎక్కువగా సాగు చేశారు.

పగలు ఎండ వేడి.. రాత్రి జడివాన

కళ్యాణదుర్గం, జూన 17: ఉదయం ఎండ వేడి... రాత్రికి జడివానతో అన్నదాత కుదేలవుతున్నాడు. పంట ఎదుగుదల వచ్చే సమయంలో వర్ష ప్రభావంతో పంటలకు మచ్చతెగులు సోకి పంటను కాపాడుకోలేక పోతున్నారు. ఎన్ని మందులు పిచికారి చేసినా తెగుళ్లు అదుపులోకి రావడం లేదు. ఈ రబీలో కర్బూజ, కళింగర, ట మోటా, బీర, మిరప, వేరుశనగ పంటలు ఎక్కువగా సాగు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కం బదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్‌ ప్రాంతాల్లో 800 ఎకరాలకుపైగా పంట లు సాగు చేశారు. ఎక్కువగా టమోటా, కర్బూజ వేశారు. కర్బూజ పంట కోత సమయంలో వారం రోజులు కురిసిన జడివానతో పంటంతా నాశనమైంది. వర్షం రాకముందు కర్బూజ టన్ను ధర రూ.30 వేలు ఉండేది. అదే వర్షం వచ్చిన తర్వాత టన్ను రూ.8 వేలకు పడిపోయింది. అసలు కాయలను కొనేవారు లేక తోటల్లోనే వదిలేశా రు. ఈ కర్భూజ పంటనే 120 ఎకరాలకు పైగా నియోజకవర్గ వ్యాప్తంగా సాగు చేశారు. రూ.కోటికి పైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. దాంతో పాటు టమోటాకు మచ్చతెగులు సోకి, కాసిన పూతంతా రాలిపోయింది. ఈ పూతను దక్కించుకోవడానికి ఎన్ని మందులు పిచికారి చేసినా ప్రయోజనం లే కుండా పోయింది. దాంతో పాటు బీరకాయ పంటకు కూ డా మచ్చతెగులు, ఆకులన్నీ ఎరుపు రంగులోకి మారిపోయాయి. వేరుశనగ పంట ఊడలు దిగే సమయానికి, ఎ డతెరిపి లేకుండా వర్షం పడటంతో బూడిద తెగులు వ చ్చి దిగుబడులపై ప్రభావం చూపింది. జడివానతో అన్నదాతలకు దడ పుట్టించి, ఆర్థికంగా నష్టానికి గురి చేసింది.

Updated Date - Jun 17 , 2024 | 11:47 PM