Share News

వీటికి కోడ్‌ వర్తించదా..?

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:29 AM

పార్టీ జెండాలు రంగులు,నాయకుల విగ్రహాలు,గుర్తులు పేర్లు ఇలా ఓటర్లను ప్రభావితం చేసేవి ఏవీ బహిరంగంగా కనిపించకూడదని ఎన్నికల సంఘం నిర్థిష్టంగా ఆదేశాలు జారీ చేశారు.

 వీటికి కోడ్‌ వర్తించదా..?
కల్లుమర్రి హాస్టల్‌ అవరణలో పడేసిన జగనన్న భూరక్ష 2020 సర్వేరాళ్లు

మడకశిర రూరల్‌, ఏప్రిల్‌ 5 : పార్టీ జెండాలు రంగులు,నాయకుల విగ్రహాలు,గుర్తులు పేర్లు ఇలా ఓటర్లను ప్రభావితం చేసేవి ఏవీ బహిరంగంగా కనిపించకూడదని ఎన్నికల సంఘం నిర్థిష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికి కొంత మంది అధికారులు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తున్నా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నరన్నా ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. మండలంలోని కల్లుమర్రి గ్రామంలో రోడ్డు ప్రక్కన ఉన్న బీసీ హస్టల్‌ ఆవరణంలో సర్వేరాళ్లు నిలువ ఉంచ్చారు వాటిపై వైఎస్సార్‌ జగనన్న భూరక్ష 2020 అని అన్నింటిపై ఉంది. భూముల సర్వే అనంతరం మిగిలిని సర్వేరాళ్లు అక్కడ ఉంచ్చారు. పేర్లులు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.

Updated Date - Apr 06 , 2024 | 12:29 AM