ఉచిత ఇసుక విధానం హామీని నెరవేర్చిన సీఎం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:32 PM
సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత ఇసుక విధానం హామీని నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం నగరంలోని తన నివాసంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ఇసుక మాఫియా రాజ్యమేలిందన్నారు.

అనంతపురం అర్బన, జూలై 8: సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత ఇసుక విధానం హామీని నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం నగరంలోని తన నివాసంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ఇసుక మాఫియా రాజ్యమేలిందన్నారు. జగన అండ్ కో వేలాది కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నెల రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంపై నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేదల సొంతింటి కల నేరవేరే అవకాశం ఉందన్నారు. నిర్మాణ రంగం ఊపందుకుంటుందన్నారు. ఉచిత ఇసుక విధానంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించిందన్నారు. వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకొని దోపిడీ చేశారన్నారు. ఈ విధానానికి చంద్రబాబు స్వప్తి పలికారన్నారు.