మీసంపై మాట మార్చిన తోపు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:03 AM
పరిటాల సునీత గెలిస్తే.. మీసం కొరిగించుకుంటా.. అని కొన్ని రోజుల కిందట ఓ చానెల్ ఇంటర్వ్యూలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పరిటాల సునీత ఘనంగా సాధించింది. తోపు ఓటమి పాలయ్యాడు. ఇదే విషయమై ఈనెల 4వ తేదీన ‘తోపుదుర్తి మీసం కొరిగించుకుంటాడా..? అని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

అనంతపురం సిటీ, జూన 6: పరిటాల సునీత గెలిస్తే.. మీసం కొరిగించుకుంటా.. అని కొన్ని రోజుల కిందట ఓ చానెల్ ఇంటర్వ్యూలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పరిటాల సునీత ఘనంగా సాధించింది. తోపు ఓటమి పాలయ్యాడు. ఇదే విషయమై ఈనెల 4వ తేదీన ‘తోపుదుర్తి మీసం కొరిగించుకుంటాడా..? అని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలైంది.
దీనిపై అటు టీడీపీ, వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ విలేకరి తోపు చేసిన సవాల్‌ను గుర్తు చేశాడు. చేసిన సవాల్ మేరకు మీసం తీసుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి తోపు సమాధానమిస్తూ... ‘ధర్మవరం ఎమ్మెల్యే సీటు రాకుంటే పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసం చేస్తామన్నారు కదా.. చేయమనండి.. అదే విధంగా వచ్చే ఆరు నెలల్లో ఇచ్చిన హామీలన్నీ పరిటాల సునీతను నెరవేర్చమనండి.. అప్పుడు నా మీసాలు తీయించుకుంటా..?’ అని మాట మార్చారు. ఇలా తోపు మాట మార్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.