Share News

దాడి అమానుషం

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:11 AM

ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసీపీ మూకల దాడిని నిరసిస్తూ పాత్రికే యులు సోమవారం రొద్దం మండల కేంద్రంలో రాస్తారోకో, ధర్నా చేపట్టారు.

 దాడి అమానుషం
గోరంట్లలో డీటీ రెడ్డిశేఖర్‌కువినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టులు

రొద్దం, ఫిబ్రవరి 19:: ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసీపీ మూకల దాడిని నిరసిస్తూ పాత్రికే యులు సోమవారం రొద్దం మండల కేంద్రంలో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. టీడీపీ, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నియో జకవర్గం అధ్యక్షుడు చిన్నప్పయ్య మాట్లాడుతూ... వైసీపీ మూకలు తప్పతాగి ఉద్దేశ్య పూర్వకంగానే కృష్ణపై దాడి చేశారని వారిపై 307 సెక్షన నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ లక్ష్మీనారాయణకు విన తి పత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ నరహరి, మాజీ సర్పంచ అశ్వత్థనారాయణ, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు హరి, మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఇమాం సాబ్‌, పాత్రికే యులు సోమశేఖర్‌, నారాయణయాదవ్‌, గోవిందు, నాగరజు, రామాంజి, శంకర్‌, జిరంజీవి, మహబూబ్‌బాషా, రఫిక్‌, కిష్ట, టీడీపీ నాయకులు ఉగ్గీరప్ప, నాగప్ప, సర్పంచ నాగరాజు, తిరుపాల్‌ నాయుడు, చంద్రశేఖరనాయుడు, గోపాల్‌, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్‌, మాజీ సర్పంచ రంగన్న, సర్పంచ నాగరాజు, రుద్రప్రసాద్‌, సూరి, వెంకీ, బీజేపీ నాయకుడు రవి పాల్గొన్నారు.

గోరంట్ల: శ్రీకృష్ణపై జరిగిన దాడికి వ్యతిరేకంగాటీడీపీ, జనసేన నాయకుల సం యుక్తంగా బస్టాండ్‌ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి డీటీ రెడ్డి శేఖర్‌కు వినతిపత్రం అందించారు. టీడీపీ నాయకులు సోముశేఖర్‌, కొత్తపల్లి నరసిం హప్ప, బెల్లా చెరువు చంద్ర, నీలకంఠారెడ్డి, వేణుగోపాల్‌, గిరి, అజంతుల్లా, ఉ మ్మర్‌ఖాన, శీనా, రవి, వెంకటరెడ్డి, నరేంద్రరాయల్‌, మనోహర్‌, వాల్మీకి సోము, జనసేన కన్వీనర్‌ సంతోష్‌, జిల్లా కార్యదర్శి సురేష్‌, సంయుక్త కార్యదర్శి వెంక టేష్‌, అనిల్‌ కుమార్‌, నాయకులు, కార్యకర్తలున్నారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కాంగ్రెప్‌పార్టీ అసెంబ్లీ ఇనచార్జ్‌ నరసింహులు, మండల కన్వీనర్‌ బోయ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గాయ పడిన శ్రీకృష్ణ చికిత్స ఖర్చును వైసీపీ భరించడం తోపాటు ఆయన కుటుం బానికి రూ.50లక్షలు ఎక్సెగ్రేషియా చెల్లించాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్‌ కు వినతిపత్రం అందించారు. అలాగే శ్రీకృష్ణపై దాడిని స్థానిక జర్నలిస్టులు ఖండించారు. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లా డీటీ రెడ్డిశేఖర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు అశ్వత్థనారాయణ, అతావుల్లా, గంగాధర్‌, శివారెడ్డి ,పూల వెంకటేష్‌, వెంకటశివ, లక్ష్మీనారాయణ, సురేంద్రనాథ్‌ , నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:11 AM