FARMERS: కౌలు రైతులు గుర్తింపు కార్డులు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:34 AM
కౌలు రైతులు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమాహేశ్వరమ్మ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కక్కలపల్లి ఆర్‌ఎ్‌సఏలో కౌలు రైతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతపురంరూరల్, జూలై 27: కౌలు రైతులు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమాహేశ్వరమ్మ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కక్కలపల్లి ఆర్‌ఎ్‌సఏలో కౌలు రైతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారిని హాజరై మట్లాడారు. కౌలుకు సాగు చేస్తున్న ప్రతి రైతు గుర్తింపు కార్డు పొందాలన్నారు. దీని వలన కౌలుకు భూములు ఇచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. ఏఓ శశికళ, జడ్పీటీసీ చంద్రకుమార్, ఏఈఓ మురళీకృష్ణ, అలేఖ్య, ఉద్యాన సహాయకులు కిషోర్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
రాప్తాడు: కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షమ పథకాలు అమలు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అన్నారు. మండలంలోని బోగినేపల్లి గ్రామంలో శనివారం జిల్లా వ్యవసాయాధికారి కౌలు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కౌలు రైతులకు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో ఏఓ శేఖర్‌రెడ్డి, సర్పంచ ఉజ్జినప్ప, రైతులు నారాయణ, ముత్యాలప్ప, శివ, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.