ఆలయ భూములనూ అమ్మేశారు.
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:42 PM
వైసీపీ నాయకులు ఆలయ భూములనూ వదలకుండా కబ్జా చేశారు. పట్టణంలోని సర్వే నెంబర్ 563లోని వీరభద్రస్వామి ఆలయ భూమికి నకిలీ పట్టాలను సృష్టించి, అమాయకుల్ని నమ్మించి, పాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. పట్టాల్లో కూడా వేరే సర్వే నెంబర్‌ను పొందుపరిచి, సర్వే నెంబర్ 563లో స్థలాలను చూపించారు.
.ఫ నకిలీ పట్టాలు సృష్టించిన వైసీపీ నాయకులు
ఫ ఇంటి నిర్మాణానికి అనుమతినిచ్చిన రెవెన్యూ అధికారులు
ఉరవకొండ, ఫిబ్రవరి 6: వైసీపీ నాయకులు ఆలయ భూములనూ వదలకుండా కబ్జా చేశారు. పట్టణంలోని సర్వే నెంబర్ 563లోని వీరభద్రస్వామి ఆలయ భూమికి నకిలీ పట్టాలను సృష్టించి, అమాయకుల్ని నమ్మించి, పాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. పట్టాల్లో కూడా వేరే సర్వే నెంబర్‌ను పొందుపరిచి, సర్వే నెంబర్ 563లో స్థలాలను చూపించారు. ఇప్పటికే ఆ భూమిలో 20మంది దాకా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. హౌసింగ్ అధికారులు సైతం ఆ భూములకు ఇళ్లు మంజూరు చేయడం ఆశ్యర్యమే. పంచాయతీ అధికారులు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వడం కొసమెరుపు. ఇదే కాకుండా సర్వే నెంబర్ 564లో పంచాయతీ ప్రజల కోసం కేటాయించిన స్థలంపై వైసీపీ నాయకులు కన్నేసినట్లు తెలుస్తోంది. ఆ స్థలం జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో సెంటు రూ.10లక్షల దాకా పలుకుతోంది. పంచాయతీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.