తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Apr 09 , 2024 | 12:03 AM
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్
మడకశిరటౌన, ఏప్రిల్ 8: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లిన పలువురు ఉగాది పండుగ సందర్భంగా తిరిగిరావడంతో సోమవారం ఆయన వారితో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అగళి, రొళ్ల మండలాలకు చెందిన పలువురు హాజరయ్యారు. ఈసందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. హంద్రీనీవా జలాలను తెచ్చి ప్రతి చెరువును నింపి స్థానిక రైతుల అభివృద్ధికి పాటు పడుతానన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటుకు పని చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగానే పరిశ్రమలు నెలకొల్పు తామని, ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారికి నియోజకవర్గంలోనే ఉపాధి పొందే విధంగా చర్యలు చేపడుతామన్నారు. అందరూ సహకరించి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పాటు పడాలని కోరారు.