Share News

మెట్టు ఏమి చేశాడో చెప్పి ఓటు అడగాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:05 AM

ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయదుర్గం నియోజకవర్గానికి ఏమి చేశాడో చెప్పిన తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని టీడీపీ బీసీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కేశప్ప సూచించారు.

మెట్టు ఏమి చేశాడో చెప్పి ఓటు అడగాలి

బొమ్మనహాళ్‌, జనవరి 31: ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయదుర్గం నియోజకవర్గానికి ఏమి చేశాడో చెప్పిన తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని టీడీపీ బీసీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కేశప్ప సూచించారు. బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ మెట్టు గోవిందరెడ్డి గతంలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా, ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి చట్టసభల్లో ఏ ఒక్కరోజు కూడా ప్రజాసమస్యలపై మాట్లాడలేదన్నారు. గోవిందరెడ్డిని ఎన్నుకుంటే రాయ దుర్గం నియోజకవర్గ అభివృద్ధి 25 సంవత్సరాలకు వెనక్కి వెళుతుందని కేశప్ప అన్నారు. రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాలవ శ్రీనివాసులుతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాలవ శ్రీనివాసులు 2019లోనూ గెలిచి ఉంటే ఉంతకల్లు వద్ద రిజర్వాయర్‌ ఒక మహర్దశకు వచ్చేదని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నాగరాజు, మహ్మద్‌ రఫీ, మాజీ కో ఆప్షన మెంబర్‌ సర్మాస్‌వలి పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:05 AM