Share News

రాప్తాడులో టీడీపీదే గెలుపు

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:38 AM

రాప్తాడు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు.

   రాప్తాడులో టీడీపీదే గెలుపు
చెన్నమనాయునికోటలో కరపత్రాలను పంచుతున్న పరిటాల సునీత

ధర్మవరంరూరల్‌, మార్చి 25: రాప్తాడు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కనగానపల్లి మండలంలోని గుంతపల్లి, తగరకుంట, తూముచెర్ల, చెన్నమనాయునికోట గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాలను అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్నా.. అనేక మందికి పథకాలు అందలేదన్నారు. సీఎం జగనరెడ్డి ఎన్నికల ముందు ప్రచారంలో ఒకటి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది మరొకటని విమర్శించారు. రాజకీయంగా ఏమైనా గొడవలు ఉంటే తమలాంటివారితో చూసుకోవాలే కానే... అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టారని అన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలేది లేదన్నారు. ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి గత ఎన్నికల్లో అబద్దాలు చెప్పి దొంగ ఓట్లు ఎక్కించి ఎన్నికల్లో గెలిచారన్నారు. ఎన్నికల అనంతరం సొంత కార్యకర్తలను కూడా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తోపుదుర్తి సోదరులు నియోజకవర్గంలో దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుని పాలన సాగించారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్‌, కన్వీనర్‌ యాతం పోతలయ్య, ఎంపీటీసీ బిల్లేభాస్కర్‌, తెలుగు యువత బట్టా సురేష్‌ చౌదరి, సర్పంచ మాధవరాజు, రామాంజి, సోమర చంద్రశేఖర్‌, రామాంజి, బోదులస్వాతి, రాములమ్మ, గిరిశాలఅరుణ, స్రవంతి, జయశంకర్‌, మల్లికార్జున, పూజారి రాజాకృష్ణ, బిల్లేదాము పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి : కనగానపల్లి మండలంలోని తూముచెర్ల, గుంతపల్లి గ్రామాల్లో పలువురు వైసీపీ నాయకులు పరిటాలసునీత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గుంతపల్లి, తగరకుంట గ్రామాల్లో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - Mar 26 , 2024 | 12:38 AM