Share News

SAVITA : బీసీలకు టీడీపీ పుట్టినిల్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:12 PM

రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు ప ుట్టినిల్లని టీడీపీ కూటమి ఎ మ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం సోమందేపల్లి మండలంలోని బ్రహ్మసముద్రం, కొల్లకుంట, రూకలపల్లిల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇం టింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించారు. సవితకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... టీడీపీ ఆవిర్భావానికి మునుపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాజకీ య అధికారానికి దూరంగా ఉండేవారన్నారు.

SAVITA : బీసీలకు టీడీపీ పుట్టినిల్లు
Savita explaining the Supersix schemes

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

పెనుకొండ టౌన, ఏప్రిల్‌ 25 : రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు ప ుట్టినిల్లని టీడీపీ కూటమి ఎ మ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం సోమందేపల్లి మండలంలోని బ్రహ్మసముద్రం, కొల్లకుంట, రూకలపల్లిల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇం టింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించారు. సవితకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... టీడీపీ ఆవిర్భావానికి మునుపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాజకీ య అధికారానికి దూరంగా ఉండేవారన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్‌క్లాస్‌ కాదని, సమాజానికి బ్యాక్‌బోన క్లాసెస్‌అని నినదించిన దివంగత ఎన్టీరామారావు అందుకు అనుగుణం గా బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన కల్పించారని గుర్తు చేశారు.


ఆయన స్ఫూర్తినే కొనసాగించిన చంద్రబాబు రి జర్వేషనను 34శాతానికి పెంచి అనేక మంది బీసీలను తిరిగులేని రాజకీయ నాయకుల్లా తీర్చిదిద్దారన్నారు. పలు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి... సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో బీసీల అభివృద్ధికి బాటలు వేశార న్నారు. స్థానిక సంస్థల దగ్గర నుంచి రాష్ట్రస్థాయి పదవుల వరకు బీసీలను ప్రోత్సహించారన్నారు. అదేజగన్మోహనరెడ్డి పాలనలో రాష్ట్రంలోని బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి పోయారన్నారు.


కార్పొరేషనలు ఫుల్లు, నిధులు నిల్లు కావడంతో గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. బీసీల సంక్షేమం, సబ్‌ ప్లాన నిధులు రూ.75వేల కోట్లను దారి మళ్లిండచమే కాకుండా వారి అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 30పథకాలను రద్దుచేసిన సీఎం జగన బీసీల ద్రోహిగా మిగిలిపోయారన్నారు. ఇప్పటికే సైకో పాలనతో జనం విసిగిపోయారని రానున్నది టీడీపీనేఅన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుంచి పట్టణాలవరకు రూపురేఖలు మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్దలింగప్ప, డీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బీకే

సోమందేపల్లి మండలం మండ్లి, ముద్దపుకుంట, జూలకుంట గ్రామాల్లో టీడీపీ కూటమి హిందూపురం పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి గురువారం పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. జరగబోయే ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:12 PM