Share News

టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:43 AM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా సమష్టిగా కృషి చేద్దామని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మన లక్ష్యం గా సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి అన్నారు.

టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
మడకశిరలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి

మడకశిర టౌన, ఫిబ్రవరి1: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా సమష్టిగా కృషి చేద్దామని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మన లక్ష్యం గా సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువా రం ఇంటిగ్రేటేడ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లోనే ఉండాలన్నారు. అలాగే ఎన్నికల వరకు ఓటరు జాబితాపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించా రు. తుది ఓటరు జాబితా పత్రి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. అందులో నకిలీ ఓట్లను ప్రత్యేకంగా గుర్తించి ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయానికి కానీ, ఎన్నికల సంఘానికి గానీ ఫిర్యాదు చేయాలని తెలిపారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి వెళ్లి తెలియజేసి బాండ్‌ రూపంలో రాసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామకోటి ఆదినారా యణ, ఆర్టీఎస్‌ కోఆర్డినేటర్‌ చందడే గంగశేఖర్‌, మైనార్టీ జిల్లా అఽధ్యక్షుడు భక్తర్‌, డాక్టర్‌ సెల్‌ అధ్యక్షుడు క్రిష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, తెలుగు యువత నాయకులు నాగరాజు, తిమ్మరాజు, కౌన్సిలర్‌ ఉమాశంకర్‌, మాజీ కౌన్సిలర్‌ ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అగళి : తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు జరిగేంత వర కు ప్రజలతోనే కలిసి ఉండాలని జడ్పీటీసీ ఉమేష్‌ సూచించారు. మండలకేంద్రంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ భవనంలో టీడీపీ ఇంటిగ్రేటెడ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. యూనిట్‌ క్లస్టర్‌ ఇనచార్జ్‌లు, బూత కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా జడ్పీటీసీ ఉమేష్‌ మాట్లాడుతూ... టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ ప్రకటించిన సూపర్‌-6 పథకాలను వివరించాలన్నారు. ఎన్ని కల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లోనే ఉండాలని, గెలుపే లక్ష్యంగా పనిచే యాల న్నారు. ఎన్నికల వరకు ఓటరు జాబితాలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్‌ ఇనచార్జ్‌లు, యూని ట్‌, బూత కన్వీనర్లు, కుటుంబ సాధికారులు తదితరులకు దిశా నిర్దేశం చేశారు.

గుడిబండ : టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ మండల కన్వీనర్‌ మద్దనకుంటప్ప పేర్కొన్నారు. గుడిబండలో గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. వైసీపీ అవినీతి అక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో తప్పుల తడకగా ఉన్న వాటిని సరిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం క్లస్టర్‌ ఇనచార్జ్‌ బూత కన్వీనర్లు, యూనిట్‌ కుటుంబ సాధికార సారథులు, తదితరులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గేష్‌, షబ్బీర్‌, ప్రకాశ, శివకుమార్‌, లక్ష్మీనరసప్ప, భీమరాజు, గుడిపల్లి జయరాం, నజీర్‌, భోజరాజ్‌, వెంకటేశ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:43 AM