Share News

సమైక్యాంధ్ర కేసుల్లో టీడీపీ నేతలకు విముక్తి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:44 PM

సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో నమోదైన కేసుల్లో ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉద్యమంలో నమోదైన కేసులను కొట్టివేస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

సమైక్యాంధ్ర కేసుల్లో టీడీపీ నేతలకు విముక్తి

ఫ కేసు కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుఫ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊరట అనంతపురం, జనవరి30 (ఆంధ్రజ్యోతి): సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో నమోదైన కేసుల్లో ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉద్యమంలో నమోదైన కేసులను కొట్టివేస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. రాష్ర్టాన్ని విభజించొద్దంటూ వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, దిగ్భందాలు నిర్వహించిన క్రమంలో దశాబ్దం క్రితం అనంతపురం వనటౌన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 147, 148, 336, 427, 506 రెడ్‌విత 14 సెక్షన్లకింద మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, గోనుగుంట్ల సూర్యనారాయణ, నాయకులు బీవీ వెంకటరాముడు, బుగ్గయ్య చౌదరి, తలారి ఆదినారాయణ, ప్రకా్‌షనాయుడు, స్వామిదాస్‌, కృష్ణకుమార్‌, సరిపూటి రమణ, మణికంఠ బాబు, వెంకటప్ప, మరూరు గోపాల్‌, సద్దల చెన్నప్ప, కూచి హరి, నారాయణస్వామి, గోనిపట్ల శీనా, ఎల్లుట్ల వెంకటస్వామిలతో పాటు గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం వైసీపీలో ఉన్న నదీం అహమ్మద్‌, మహాలక్ష్మి శ్రీనివా్‌సలపై అప్పట్లో కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించిన విచారణ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో సుదీర్ఘంగా సాగింది. పలు వాయిదాల అనంతరం మంగళవారం సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులను కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా... ఈ తీర్పుపై మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారఽధులు స్పందిస్తూ... రాష్ట్రం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పోరాడామన్నారు. ఆ రోజుల్లో రాష్ట్ర విభజన జరగొద్దని కేసులకు వెరవకుండా ప్రజల పక్షాన ఉద్యమించామన్నారు. తెలుగుప్రజలు ఐక్యంగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేశామన్నారు. ఆ క్రమంలోనే తమతోపాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయన్నారు. కోర్టు తీర్పు సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు

టీడీపీతోనే బీసీల అభివృద్ధి, సంక్షేమంనార్పల, జనవరి30: రాష్ట్రంలో బీసీల అభివృద్ధి, సంక్షేమం ఒక్క టీడీపీతోనే సాధ్యమవుతుందని ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, కేశవరెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని బీ పప్పురూ గ్రామంలో టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య అద్యక్షతన ‘జయ హో బీసీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథులుగా శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యు లు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ బీసీ ఓట్లతో గద్దెనెక్కిన వైసీపీ వారికే మొండిచేయి చూపుతోందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చంద్రబాబు అన్ని విధాలుగా పెద్దపీట వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలపి బీసీల సత్తా నిరుపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డేర్ల సంఘం అధ్యక్షుడు వెంకట్‌, రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు గంగులకుంట వెంకటరమణ, కుమ్మర రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పోతులయ్య, రాష్ట్ర కార్యదర్శి కురబ శివబాల, బీసీ జిల్లా నాయకులు ఆలం వెంకటనరసానాయుడు, బీసీ సెల్‌ కార్యనిర్వహక కార్యదర్శులు రాజన్న, బొఠి్గునారాయణస్వామి, జాఫర్‌వలి, ధనుంజయ, జనసేన మండల అధ్యక్షుడు రామకృష్ణ, టీడీపీ మండల కన్వీనర్‌ ఎర్రనాగప్ప, వడ్డేర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వన్నూరప్ప, నియోజకవర్గ బీసీ సెల్‌ కార్యదర్శి నారాయణస్వామి, టీఎనటీయూసీ రాష్ట్ర నాయకులు బ్యాళ్ల నాగేంద్ర, జిల్లా అధికారప్రతినిధి పరుశురామ్‌, జిల్లా బీసీ సెల్‌ కార్యనిర్వహణ కార్యదర్శి కోయ్యగురు పెద్దన్న, జిల్లా నాయకులు రంగారెడ్డి, లక్ష్మీనారాయణ, తలారి కుల్లాయప్ప, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:44 PM