Share News

కార్యకర్తలకు ఎల్లప్పుడు టీడీపీ అండ

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:00 AM

కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పు డూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న తెలిపారు.

కార్యకర్తలకు ఎల్లప్పుడు టీడీపీ అండ
ముద్దరంగప్ప కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న ఈరన్న

మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న

మడకశిర రూరల్‌, ఫిబ్రవరి 5 : కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పు డూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న తెలిపారు. టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ బుళ్ళసముద్రం గ్రామానికి చెందిన ముద్దరంగప్ప అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఈరన్న ఆ గ్రామానికి వెళ్లి ముద్దరంగప్ప భౌతిక కాయంపై పూలమాల వేసి, నివాళుల ర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా మణూరు పంచాయ తీ సుంకరెడ్డిపల్లికి చెందిన మండల మాజీ కన్వీనర్‌ శంకర్‌రెడ్డి కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆ గ్రామానికెళ్లి శంకర్‌రెడ్డిని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యవిషయాలు అడిగి తెలుసుకోన్నారు. ఈ రన్న వెంట మాజీ ఎంపీపీలు అశ్వత్థామప్ప, ఆదినారాయణ, మండల మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:00 AM