Share News

కురుబలకు పెద్దపీట వేసిన టీడీపీ

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:11 AM

తెలుగుదేశం పార్టీ కురుబలకు పెద్దపీట వేసిందని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత అన్నారు.

కురుబలకు పెద్దపీట వేసిన టీడీపీ
ఆత్మీయ సమావేశంలో బీకే, సవితను కంబళితో సన్మానిస్తున్న దృశ్యం

ఆత్మీయ సమావేశంలో బీకే, సవిత

హిందూపురం, ఏప్రిల్‌, 17: తెలుగుదేశం పార్టీ కురుబలకు పెద్దపీట వేసిందని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత అన్నారు. పెనుకొండలో బుధవారం కురుబకులస్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి నియోజకవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చారు. ఈ సం దర్భంగా పార్థసారథి మాట్లాడుతూ తాను ఇప్పటి వర కు ఇన్ని పదవులు అనుభవించానంటే కేవలం కురుబ కులస్తుడు కావడమే అన్నారు. నియోజకవర్గంగా మన కులం బలంగా ఉందన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మన కులాన్ని గుర్తించి ఆదరించిందన్నారు. సింగిల్‌ విం డో అధ్యక్షుడి నుంచి జిల్లాపరిషత చైర్మన, ఎమ్మెల్యే, ఎంపీ అయినానంటే కేవలం కురుబల అండ ఉండడ మే అన్నారు. ఇది పార్టీ మనపై పెనట్టిన నమ్మకమ న్నారు. ప్రస్తుతం పార్లమెంటుతో పాటు పెనుకొండ అభ్యర్థి కూడా కురుబలకు ఇవ్వడం గర్వకారణమన్నారు. పార్టీ మనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరుబలందరూ టీడీపీని ఆదరించాలన్నారు. సవిత మా ట్లాడుతూ ఎన్టీర్‌ హయాంలోనే మన కులాన్ని గుర్తించి ఎమ్మెల్యే, మంత్రి పదవిని ఇచ్చారన్నారు. జరిగే ఎన్నిక ల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న కురుబలు టీడీపీకి ఓటు వే యాలని పిలుపునిచ్చారు. పార్టీ మనపై పెట్టిన నమ్మ కాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని కురుబ కులస్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:11 AM