Share News

ధర్మవరంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:35 AM

ముదిగుబ్బ, ఫిబ్రవరి 26: వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో సోమవారం వాల్మీకుల ఆత్మీయ సమావేశం సాగింది.

 ధర్మవరంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం

- వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో పరిటాల శ్రీరామ్‌

ముదిగుబ్బ, ఫిబ్రవరి 26: వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో సోమవారం వాల్మీకుల ఆత్మీయ సమావేశం సాగింది. తొలుత వారు ర్యాలీ నిర్వహించారు. పరిటాల శ్రీరామ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి నివాళులర్పించారు. తర్వాత మాట్లాడుతూ.. వాల్మీకులకు ఒక చరిత్ర ఉందని, సమాజానికి నాగరికత నేర్పింది వాల్మీకులేనని తెలిపారు. పరిటాల కుటుంబానికి, బోయ కులస్థులకు చాలా దగ్గర సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గతంలో తమ తాత పరిటాల శ్రీరాములును హత్య చేసిన సమయంలో, బోయ రామాంజనేయులు కూడా ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తన కుటుంబం... వాల్మీకి కులస్థులు వేరు కాదని పేర్కొన్నారు. దేశమంతా వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉంటే.. ఒక రాయలసీమలో మాత్రం బీసీలుగా ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీల్లో కలపడంపై చంద్రబాబు ఖచ్చితంగా దృష్టి సారిస్తారని తెలిపారు. వైసీపీ హయాంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర అవమానాలకు గురయ్యారని అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గూండాలకు, రౌడీలకు నియోజకవర్గాన్ని అప్పజెప్పారని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా అడుగు ముందుకు వేయాలని సూచించారు. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు మా కుటుంబానికి రెండు కళ్లు లాంటివని, వాటిని కాపాడుకునే బాధ్యత తమదేనని అన్నారు. కార్యక్రమంలో వాల్మీకి నాయకులు రంగయ్య, బొట్టు కిష్ట, పోతుకుంట లక్ష్మన్న, బోయ రవిచంద్ర, మద్దిలేటి, గొట్లూరు శీనా, తలారిచంద్రమోహన, చిన్నవీరప్ప, టీడీపీ మండల కన్వీనర్‌ కరణంప్రభాకర్‌, క్లస్టర్‌ ఇనచార్జి తుమ్మల మనోహర్‌, నాయకులు సూర్యశేఖర్‌రాజు, చికెన తిరుపాల్‌, కిష్టప్ప, సూరి, పోతలయ్య, పవన, గంగాధర్‌, రాఘవ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:35 AM