Share News

MLA KALAVA : ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:52 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలం లోని జుంజురంపల్లి సమీపంలోని వేదావతిహగరి నది వద్ద ఇసుకరీచలో సోమవారం ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమా న్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీలను నెరవేర్చేందు కు తొలిసంతకం పెట్టారన్నారు.

MLA KALAVA : ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోండి
MLA Kalava filling sand with an excavator

ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గంరూరల్‌, జూలై 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలం లోని జుంజురంపల్లి సమీపంలోని వేదావతిహగరి నది వద్ద ఇసుకరీచలో సోమవారం ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమా న్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీలను నెరవేర్చేందు కు తొలిసంతకం పెట్టారన్నారు. పింఛన రూ. 4వేలు పెంచి అందిస్తున్నారన్నారు. ఉచితంగా ఇసుకను పొందేందుకు జుం జురంపల్లి ఇసుకరీచలో వెసులుబాటు కల్పించామన్నారు. గతంలో ఈ ఇసుకరీచ వైసీపీ నాయకుల ఇసుకదోపిడీకి నిలయంగా ఉండేద న్నారు. ప్రభుత్వం ఇసుక పంపిణీని అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్‌ చార్జీ రూ. 195 తీసుకుని టన్ను ఇసుకను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టిం దన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ నిర్మాణాలకు ఈ ఇసుకను వాడు కోవచ్చన్నారు. టన్ను ఇసుక కూడా దుర్వి నియోగం కాకుండా అధికా రులు చూడాలన్నారు. ము ఖ్యమంత్రి చంద్రబాబు ఆదే శాల మేరకు ఇసుక పంపి ణీకి అధికారులు సిద్ధం అ వుతున్నారన్నారు. కార్యక్ర మంలో మైన్స అండ్‌ జి యాలజీ డీడీఏ నాగయ్య, డీ టీ రఘు, వీఆర్వో భీమప్ప, పంచాయతీ కార్యదర్శి అశోక్‌, సర్పంచులు వన్నూ రుస్వామి, అశోక్‌, రాజశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ హనుమంతు, టీడీపీ నా యకులు పోట్ల రవి, టంకశాల హనుమంతు, కాటా వెంకటేశులు, లచ్చన్న, వీర య్యస్వామి, గోవిందరాజులు, సోమశేఖర్‌, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 08 , 2024 | 11:52 PM