Share News

అక్రమ లేఔట్లపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:31 PM

రాప్తాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ లేఔట్లపై కలెక్టర్‌ కఠిన చర్యలు తీసుకోవాలని రాప్తాడు టీడీపీ సర్పంచ సాకే తిరుపాలు డిమాండ్‌ చేశారు.

అక్రమ లేఔట్లపై చర్యలు తీసుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ సర్పంచ సాకే తిరుపాలు

రాప్తాడు, జనవరి 29: రాప్తాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ లేఔట్లపై కలెక్టర్‌ కఠిన చర్యలు తీసుకోవాలని రాప్తాడు టీడీపీ సర్పంచ సాకే తిరుపాలు డిమాండ్‌ చేశారు. రాప్తాడులోని గ్రామ సచివాలయంలో సోమవారం పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ పరిధిలో వందకు పైగా ఎకరాల్లో అహుడా అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మొత్తం భూమిని విక్రయించి సొమ్ము చేసుకుం టున్నారన్నారు. ల్యాండ్‌ కన్వర్షన కూడా లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా మండల స్థాయి అధికారుల్లో చలనం లేదన్నారు. రెండేళ్ల నుంచి రిజిష్టర్‌ స్టాంప్‌ ఫీజు కూడా గ్రామ పంచాయతీ ఖాతాకు జమ కావడం లేదన్నారు. దీంతో పంచాయతీ నష్టం వాటిల్లుతోందని, అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా సక్రమంగా ఇవలేకపోతున్నామని వాపోయారు. అక్రమ లేఔట్లపై ఆధారాలతో కలెక్టర్‌, డీపీఓ, డీఎల్‌పీఓకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రకళ, మాధవిలత, రేణుక, రాజు, రమాదేవి, గ్రామస్థులు గేటు సత్తి, మహేష్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:31 PM