పవర్‌లూమ్స్ కార్మికులను ఆదుకోండి
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:53 PM
పవర్‌లూమ్స్ కార్మికులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
గోరంట్ల, జనవరి 29: పవర్‌లూమ్స్ కార్మికులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు పవర్‌లూమ్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం పలువురు కార్మికులు గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేత వస్ర్తాల ఎగుమతులు నిలిచిపోవడంతో కూలీలుగా పనిచేస్తు న్న కార్మికులకు ఉపాధి లభించక నరకయాతన పడుతున్నామన్నారు. నివాస గృహాలకు అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నామన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ను స్పందనలో కలిసి తమ గోడు వినిపించా మని తెలిపారు. ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని అభ్యర్థించామన్నారు. కలెక్టర్ సూచన మేరకు 90మంది నేత కార్మికులు దరఖాస్తులతోపాటు వినతిపత్రాన్ని తహసీల్దార్ రంగనాయకు లుకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పవర్‌లూమ్స్ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, రామక్రిష్ణ, శంకర్‌బాబు, మహేష్, వెంకటేశ, శ్రీనివాసులు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.