Share News

సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్నివర్గాలకు లబ్ధి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:31 AM

ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అధినేత ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్నివర్గాలకు లబ్ధి
మొరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

ఇంటింటి ప్రచారంలో టీడీపీ నాయకులు

చిలమత్తూరు, ఏప్రిల్‌ 4: ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అధినేత ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ హిందూపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, మండల కన్వీనర్‌ రంగారెడ్డి ఆధ్వర్యంలో గురువారం మండలంలోని మొరంపల్లిలో ఇంటింటి ఎన్నికల ప్ర చారం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్‌, నాయకులు శ్రీదేవి, కౌన్సిలర్‌ మంగేష్‌, మరేష్‌, వినోద్‌, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, మీసేవ సూరి, పందిపర్తి గంగాధర్‌, నారాయణప్ప, లక్ష్మన్న, వెంకటేశులు, హోటల్‌ చంద్ర, ఉరుము నంజుండ, నరేష్‌, సోము, రా జేంద్రప్రసాద్‌ తదితరలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు.

Updated Date - Apr 05 , 2024 | 12:31 AM