Share News

అర్హులందరికీ సబ్సిడీ విత్తనకాయలు : కలెక్టర్‌

ABN , Publish Date - May 18 , 2024 | 12:18 AM

జిల్లాలోని అర్హత గల రైతులందరికీ సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేస్తామని, విత్తన కాయలు నాణ్యతలో రాజీ ఉండబోదని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు.

అర్హులందరికీ సబ్సిడీ విత్తనకాయలు : కలెక్టర్‌
లోలూరు క్రాస్‌ వద్ద వేరుశనగ కాయలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

శింగనమల, మే 17: జిల్లాలోని అర్హత గల రైతులందరికీ సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేస్తామని, విత్తన కాయలు నాణ్యతలో రాజీ ఉండబోదని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం శింగనమల మండలంలోని లోలూరు క్రాస్‌ సమీపంలో ఉన్న సాయి విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌లో విత్తనాలను ఆయన పరిశీలించారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌లో కే6 రకం కాయలు 4000 క్వింటాళ్ల రాగా ఇప్పటి వరకు 2640 క్వింటాలు ప్రాసెసింగ్‌ పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. విత్తనాల ప్రాసెసింగ్‌ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, శింగనమల తహసీల్దార్‌ శోభనబాబు, ఏవోలు రాజేష్‌నాయక్‌, అన్వేష్‌, శ్రీనివాసులు, అఖిల, సుధాకర్‌రెడ్డి ఉన్నారు.


నేటి నుంచి పేర్లు నమోదు చేసుకోండి

గార్లదిన్నె : సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలు కావా ల్సిన రైతులు శనివారం నుంచి రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వ్యవసాయ సంచా లకులు రవి తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ గోడౌనలో నిల్వ చేసిన వేరుశనగ విత్తన కాయాల నాణ్యతను ఏఓ సోమశేఖర్‌తో కలసి పరిశీలించిన ఆయన మాట్లాడారు. 30 కేజీల బస్తా రూ. 2850 ఉండగా 40 శాతం సబ్సిడీతో రైతు రూ. 1710 చెల్లించాలన్నారు. ఒక రైతుకు మూడు బస్తాలు చొప్పున అందచేస్తామన్నారు. వేరుశనగ విత్తన కాయలు కావాల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, ఫోన తీసుకుని రైతు భరోసా కేంద్రాల వద్దకు రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు రైతు భరోసా సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

Updated Date - May 18 , 2024 | 12:18 AM