Share News

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:23 AM

ధర్మవరం, ఫిబ్రవరి 29: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎ దగాలని పట్టణంలోని ప్రభు త్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రి న్సిపాల్‌ సురేశబాబు సూచించారు. స్థానిక యశోద స్కూల్‌ లో గురువారం జాతీయ సైన్స దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ధర్మవరం, ఫిబ్రవరి 29: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎ దగాలని పట్టణంలోని ప్రభు త్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రి న్సిపాల్‌ సురేశబాబు సూచించారు. స్థానిక యశోద స్కూల్‌ లో గురువారం జాతీయ సైన్స దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా విద్యార్థులు పలు సైన్స నమూనాలను తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు. వీటిని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పాఠశాల డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌, ప్రిన్సిపాల్‌ అనూప్‌ తిలకించారు. వాటిని ఎలా తయారు చేశారని విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. సురేశబాబు మాట్లాడుతూ..మానవాళికి సైన్స ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతివిద్యార్థి శాస్త్రవేత్తలుగా ఎదిగి నూతన పరిశోధనలు చేయాలని ఆకాంక్షించారు. తర్వాత ఉత్తమమైన నమూనాలను తయారు చేసిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:23 AM