విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:38 PM
విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ మగ్బుల్ బాషా, ప్రధానోపాధ్యాయుడు జగదీష్ పేర్కొ న్నారు.

బుక్కపట్నం, జూలై 5: విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ మగ్బుల్ బాషా, ప్రధానోపాధ్యాయుడు జగదీష్ పేర్కొ న్నారు. శుక్రవారం బుక్కపట్నంలో ఉమ్మడి జిల్లాల షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో బాలుర విభాగం నుంచి తరుణ్, హర్షవర్ధన, సాయిజేశ్వంత, నవీన, గణేష్, నారాయణస్వామి, కేదార్‌నాథ్, మారుతి, రాజా... బాలికల విభాగం నుంచి వర్ధినీ, అక్షయ, శాలిని, మైత్రీ, రక్షిత, సాయిభార్గవి ఎంపికయ్యారన్నారు.
వీరు ఆగష్టులో గుంటూరులో నిర్వహించే 43వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసిసోషియేషన సెక్రటరీ మనోహర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ పూల ప్రసాద్, కేజీబీవీ ఎస్‌ఓ సౌజన్య, పీడీలు నాగరాజు, జయప్రసాద్, రేఖ, రమాదేవి, స్వర్ణకుమారి, నవానీత, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.