Share News

రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:12 AM

కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలుపుతూ దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ కార్యక్ర మం చేపట్టారు.

రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
పురంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

సీఐటీయూ నాయకులు

హిందూపురం అర్బన, ఫిబ్రవరి 16: కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలుపుతూ దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ కార్యక్ర మం చేపట్టారు. ఇందులో భాగంగా హిందూపురంలో స్థానిక ఇందిరా పార్కు నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడతూ... రైతు లకు న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా వెళ్తోందని విమర్శించారు. స్వామినాథన కమిషన సిఫార్సులను సమగ్రంగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలన్నారు. కార్మికవర్గం పోరాటాలతో సాఽధించుకున్న హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడిచేస్తోం దన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి సాంబశివ, రాజప్ప, రామకృష్ణ, అంగనవాడీ వర్కర్‌ల యూనియన కార్యదర్శి లావణ్య, మునిసిపల్‌ వర్కర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి జగదీష్‌, కోశాధికారి గురునాథ్‌, పరమేష్‌ చంద్ర ఎస్‌ఎఫ్‌ నాయకుడు బాబావలి, పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు.

పెనుకొండ: కేంద్ర ప్రభుత్వం పదేళ్ల నుంచి మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అనుసరిస్తోందంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వ హించిన భారతబంద్‌లో భాగంగా పెనుకొండలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ సర్కిల్‌వద్ద రాస్తారోకో చేప ట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్‌, సీఐటీయూ నాయకుడు రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

పావగడ: కేంద్రప్రభుత్వం నిత్యావసరాల సరుకుల ధరలను పెంచడంతోపాటు కార్మిక హక్కులను కాలరాస్తోందంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దఎ త్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ నుంచి ర్యాలీగా వచ్చి శనిమహాత్మ స ర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. అంగనవాడీ కార్యకర్తల సంఘం నాయకురాలు సుశీలమ్మ, కార్మిక సంఘం నాయకులు రామకృష్ణప్ప, శివగంగమ్మ తదితరులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గ్రేడ్‌-2 తహసీల్దార్‌ నరసింహమూర్తికి అందజేశారు.

Updated Date - Feb 17 , 2024 | 12:12 AM