Share News

కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:16 AM

ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చిలమత్తూరు మండల జర్నలిస్టులు కోరారు.

కఠిన చర్యలు తీసుకోవాలి
పెనుకొండలో నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు

చిలమత్తూరు: ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చిలమత్తూరు మండల జర్నలిస్టులు కోరారు. వారు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ యూనాస్‌ బాబుకి, పోలీస్‌ స్టేషన్లో జమేదార్‌ గురుస్వామికి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మండల జర్నలిస్టులు పవన, శ్రీనివాస రెడ్డి, రమేష్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి, పవనకుమార్‌, రామాంజి, రవీంద్రారెడ్డి, బాలునా యక్‌ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

పెనుకొండ టౌన: ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు హుజూర్‌ పేర్కొన్నారు. దాడిని ఖండిస్తూ ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి సబ్‌కలెక్టర్‌ ఎదుట నిరసన తెలిపి జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. దాడి చేసిన వైసీపీ గూండాలను అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు రవి, సాయిప్రసాద్‌, జావేద్‌ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, జీజేపీ, జర్నలిస్టు సంఘాల నాయకులు సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఏఓకు వినతి అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... అవ నీతిని, తప్పులను ఎత్తిచూపితే దాడులు చేయడం పిరికిపంద చర్యలన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీరాములు, గంగాధర్‌, బాలస్వామి, బీజేపీ నాయకులు రామకృష్ణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

హిందూపురం అర్బన: ప్రస్తుత ప్రభుత్వంలో పాత్రికేయులకు రక్షణ కరువైందని సీపీఐ నాయకుడు వినోద్‌ పేర్కొన్నారు. సీపీఐ నాయకులు సోమవారం స్థానిక తహసీల్దార్‌ శివప్రసాద్‌రెడ్డిని కలిసి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని వినతి అందించారు. కార్యక్రమంలో బికెఎంయూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలాస్వామి, సిపిఐ పట్టణ నాయకుడు ఫకృద్దీన, నాగరాజు పాల్గొన్నారు.

రొళ్ల, ఫిబ్రవరి 19: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ మండల నాయకులు పేర్కొన్నారు. వారు సోమ వారం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్ర జ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసీపీ రౌడీ మూక లు దాడి చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాడ్‌చేశారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర వక్కలిగ సాధికార కన్వీనర్‌ పాండురంగప్ప, టీడీపీ జిల్లాకార్యదర్శి రవి భూషణ్‌, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్‌ రామన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:16 AM