Share News

వలంటీర్ల ప్రచారాన్ని అరికట్టండి: టీడీపీ

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:04 AM

వైసీపీ నాయకుల తో కలిసి వలంటీర్లు కొనసాగిస్తున్న ప్ర చారాన్ని అరికట్టాలని కోరుతూ పలువురు టీడీపీ నాయకులు మంగళవారం ఈఓపీ ఆర్‌డీ వెంకటేష్‌కు వినతిపత్రం అంద జేశారు.

వలంటీర్ల ప్రచారాన్ని అరికట్టండి: టీడీపీ

యాడికి, మార్చి5: వైసీపీ నాయకుల తో కలిసి వలంటీర్లు కొనసాగిస్తున్న ప్ర చారాన్ని అరికట్టాలని కోరుతూ పలువురు టీడీపీ నాయకులు మంగళవారం ఈఓపీ ఆర్‌డీ వెంకటేష్‌కు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ యాడికిలో కొందరు వలంటీర్లు వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచా రం నిర్వహిస్తున్నారన్నారు. ఓటరు జాబితా ను తీసుకొని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన ఆదేశాలమేరకు వలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదని తెలిపారు. కొందరు వలంటీర్లు నిబంధనలను తుంగలో తొక్కి వైసీపీ నాయకుల తో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, తెలుగుయువత జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పరిమి చరణ్‌, ఆదినారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, రంగస్వామి, హుస్సేనవలి, ప్రవీణ్‌ కు మార్‌, ఆంజనేయులు, రాజు తదతరులు ఉన్నారు.

పాల్గొంటే కఠిన చర్యలు: ఎంపీడీఓ

వలంటీర్లు పార్టీల ప్రచారంలో పాల్గొంటే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ సావిత్రి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ అసెంబ్లీ ఎన్నికలు-2024 నియమావళి ప్రకారం పార్టీలకు సంబంధించిన ప్రచారంలో ఎటువంటి కార్యక్రమాల్లో గానీ వలంటీర్లు పాల్గొనరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలక్షన యాక్ట్‌ ప్రకారం తీవ్రమైన చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. ఉత్తర్వు కాపీలను అన్ని సచివాలయాల వద్ద నోటీసుబోర్డులో అంటించారు.

Updated Date - Mar 06 , 2024 | 08:10 AM