Share News

STone attack: రాళ్లదాడి కేసులో నిందితుల కోసం విస్తృత గాలింపు

ABN , Publish Date - May 22 , 2024 | 12:30 AM

ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడి కేసుకు సంబంధించిన ఆందోళనకారులను పట్టుకోవడం కోసం పోలీసు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్‌, రైల్వేస్టేషన, శివార్లలో ప్రతి ఒక్కరిని తనిఖీచేసి పంపుతున్నారు. పలుచోట్ల గొడవలకు సంబంధం లేని వారిని సైతం పోలీస్‌స్టేషనకు తీసుకువస్తున్నారన్న ప్రచారం ఉంది.

STone attack: రాళ్లదాడి కేసులో నిందితుల కోసం విస్తృత గాలింపు
Police ready for checks at bus stand

తాడిపత్రిటౌన, మే21: ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడి కేసుకు సంబంధించిన ఆందోళనకారులను పట్టుకోవడం కోసం పోలీసు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్‌, రైల్వేస్టేషన, శివార్లలో ప్రతి ఒక్కరిని తనిఖీచేసి పంపుతున్నారు. పలుచోట్ల గొడవలకు సంబంధం లేని వారిని సైతం పోలీస్‌స్టేషనకు తీసుకువస్తున్నారన్న ప్రచారం ఉంది. నిందితులను గుర్తించి అరెస్ట్‌లు చేస్తే బాగుంటుందని, ఎవరిని పడితే వారిని అరెస్ట్‌చేసి కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రెండురోజులక్రితం మండలంలోని బుగ్గ, తేళ్లమిట్టపల్లి, వెంకటాంపల్లి గ్రామాల నుంచి పలువురిని అరెస్ట్‌చేసి స్టేషనకు తీసుకువచ్చారు.


వీరిలో సగం మందికి ఎలాంటి సంబంధం లేకపోయిన స్టేషనకు తీసుకురావడంతో వారి కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. అల్లర్లకు సంబంధం లేదని తెలిసినప్పటికి వారిపై కేసు నమోదు చేయడంలో ఆంతర్యం ఏమిటో పోలీసులకే తెలియాలి. మంగళవారం కర్నూలు జిల్లా బూర్గుల సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రంలో ఉన్న తాడిపత్రి, యాడికి మండలాలకు చెందిన వారిని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వీరిలో కూడా ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చాలామంది ఉన్నట్లు సమాచారం.

Updated Date - May 22 , 2024 | 12:30 AM