SAVITA : టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు: సవిత
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:50 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం మంగళవారం పరిగి మండలంలోని ఊటకూరు, శాసనకోట, పరిగి పంచా యతీల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఇక్కడి ప్రజలకు అండగా ఉన్నానన్నారు. రాజకీయాల్లోకి వచ్చిందే ఈ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికని, కార్యకర్తల వెన్నంటే ఉంటానన్నారు.
హిందూపురం/గోరంట్ల, ఏప్రిల్ 30: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం మంగళవారం పరిగి మండలంలోని ఊటకూరు, శాసనకోట, పరిగి పంచా యతీల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఇక్కడి ప్రజలకు అండగా ఉన్నానన్నారు. రాజకీయాల్లోకి వచ్చిందే ఈ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికని, కార్యకర్తల వెన్నంటే ఉంటానన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్లదిగ్గజం కియ పరిశ్రమను తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమని దానివల్ల పెనుకొండ రూపురేఖలు మారాయన్నారు. వైసీపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
అలాగే గోరంట్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత భర్త వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు టీడీపీ స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ సోముశేఖర్, నిమ్మల యువశేఖర్, అశ్వత్థరెడ్డి, కక్కల రఘు, సుధాకర్‌రెడ్డి, రామచంద్ర, విజయ శేఖర్, వెంకటరెడ్డి, రమణారెడ్డి, శీనా తదితరులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....