Share News

తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ధి: పయ్యావుల కేశవ్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:51 PM

తెలుగుదేశంపార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పీఏసీ చైర్మన, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ధి: పయ్యావుల కేశవ్‌

కూడేరు, ఫిబ్రవరి 6: తెలుగుదేశంపార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పీఏసీ చైర్మన, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అంతరగంగ, రామచంద్రాపురం, గొట్కూరు గ్రామాలలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయా గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. రామచంద్రాపురం గ్రామంలో టీడీపీ శ్రేణులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, కురుగుంట బ్రహ్మయ్య, రామచంద్ర, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:51 PM