divotional వాసవీ మాతకు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:49 AM
మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతకు ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు ఘనంగా జరిగాయి.
బెళుగుప్ప, జూలై 14 : మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతకు ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు ఘనంగా జరిగాయి.
ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శాఖాంబరిగా అలంకరించి పూజలు చేశారు. మహిళా భక్తులు లలితపారాయణం చేశారు. తీర్థ ప్రసాదాల వినియోగంతో పూజలు ముగిసినట్లు ఆలయఅర్చకులు నందకుమార్ స్వామి తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..