divotional సత్యసాయికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:34 AM
భగవాన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ని సత్యసాయి మందిరంలో ఆదివారం ప్రత్యే క పూజ లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు బా బా విగ్రహానికి మహాన్యాసపూర్వక ఏ కాదశ రుద్రాభిషేకం, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.
తాడిపత్రి, ఆగస్టు 25: భగవాన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ని సత్యసాయి మందిరంలో ఆదివారం ప్రత్యే క పూజ లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు బా బా విగ్రహానికి మహాన్యాసపూర్వక ఏ కాదశ రుద్రాభిషేకం, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం సత్యసాయి చిత్రపటాన్ని అలంకరించి బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి మందిరం వరకు మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. ప్రపంచశాంతి కోసం లోకకల్యాణార్థం కోసం సత్యసేవా సంఘం రాష్ట్ర వేద అధ్యయనం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించినట్లు సత్యసాయి మండలి సభ్యులు తెలిపారు. భక్తులకు అన్నదానం చేపట్టారు. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సత్యసాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..