Share News

pay attention

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:53 AM

ఇంజనీరింగ్‌ అధికారుల అలసత్వం... కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నగరపాలిక పరిధి హౌసింగ్‌బోర్డులో నగరంలోని అతి పెద్ద పార్కు రాజీవ్‌ చిల్డ్రన్స పార్క్‌ ఎదుట రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను రూ. కోటితో చేపట్టారు.

pay attention
An abandoned gravel road

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 21: ఇంజనీరింగ్‌ అధికారుల అలసత్వం... కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నగరపాలిక పరిధి హౌసింగ్‌బోర్డులో నగరంలోని అతి పెద్ద పార్కు రాజీవ్‌ చిల్డ్రన్స పార్క్‌ ఎదుట రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను రూ. కోటితో చేపట్టారు. రోడ్డు విస్తరణ, పేపర్‌ బ్లాక్స్‌తో 400 మీటర్ల మేర ఈ రహదారి నిర్మాణ పనులు నిర్మించాల్సి ఉంది. దాదాపు 50 రోజుల కిత్రం ప్రారంభమైన ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత రోడ్డుకు ఇరువుపైలా మట్టి తీశారు. ఆ సమయంలోనూ ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


కొన్ని రోజులు దాటాక రోడ్డుకు ఇరువైపులా కంకర వేశారు. తాజాగా రోడ్డు మొత్తం కంకర వేశారు. దీంతో ఆ దారిలో వెళ్లడానికి వాహనదారులు, పాదచారులు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం పార్కుకు వెళ్లే వారు వాహనాలు పార్క్‌ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన ముందే ఈ వర్క్‌కు అనుమతి వచ్చినా నేటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఏఈ బాబావలి వివరణ కోరగా... రోలింగ్‌ చేస్తున్నామని, మరో 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 12:53 AM