Share News

హామీ గుర్తుందా.. ఎమ్మెల్యే గారూ..!

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:40 AM

మండలంలోని రాచేపల్లి పంచాయతీ ఆనందరావుపేట గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. రెండు నెలల కిందట ఆ గ్రామంలో గడప గడపకూ వైసీపీ కార్యక్రమాన్ని ఎమెల్యే జొన్నలగడ్డల పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి, సర్పంచ రమేష్‌ నిర్వహించినప్పుడు గ్రామస్థులు ఈ సమస్యపై వారిని నిలదీశారు.

హామీ గుర్తుందా.. ఎమ్మెల్యే గారూ..!
ఆనందరావు పేటలో నీటి కోసం పాట్లు

శింగనమల, ఫిబ్రవరి 12: మండలంలోని రాచేపల్లి పంచాయతీ ఆనందరావుపేట గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. రెండు నెలల కిందట ఆ గ్రామంలో గడప గడపకూ వైసీపీ కార్యక్రమాన్ని ఎమెల్యే జొన్నలగడ్డల పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి, సర్పంచ రమేష్‌ నిర్వహించినప్పుడు గ్రామస్థులు ఈ సమస్యపై వారిని నిలదీశారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని వారు అప్పుడు హామీ ఇచ్చారు. అనంతరం అటువైపు వారు కన్నెత్తి చూడలేదు. పది రోజుల క్రితం తాగునీటి బోర్లు రిపేరీకి రావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. బిందెడు నీటి కోసం ఆ గ్రామ ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. స్థానిక సర్పంచ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, పాలకులు ఏ మాత్రం ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ట్రాక్టర్‌ ద్వారా తాగునీటిని ఆ గ్రామానికి పంపుతున్నాడు. ట్యాంకు వచ్చినప్పడు నీటి కోసం జగడాలు జరుగు తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించాలని సీపీఎం మండల కార్యదర్శి భాస్కర్‌, ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:40 AM