Share News

divotional అంజన్న ఆలయాల్లో శ్రావణ పూజలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:48 AM

పవిత్ర శ్రావణమాసంలో వివిధ ఆలయాల్లో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ముఖ్యంగా కసాపురం, మురడి, నేమకల్లు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

divotional అంజన్న ఆలయాల్లో శ్రావణ పూజలు

గుంతకల్లు/ బొమ్మనహాళ్‌/ డీ.హీరేహాళ్‌, ఆగస్టు 20: పవిత్ర శ్రావణమాసంలో వివిధ ఆలయాల్లో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ముఖ్యంగా కసాపురం, మురడి, నేమకల్లు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.


కసాపురం ఆలయంలో తెల్లవారుజామునే నెట్టికంటి ఆంజనేయ స్వామివారి మూల విరాట్టుకు అభిషేకాలు, పుష్ప, స్వర్ణ కవచ అలంకారాలు చేసి, భక్తులకు దర్శనం కలిగించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హనుమాన చాలీసా పారాయణం, సుందరకాండ పఠనాలను చేశారు. రాత్రి 8:30 గంటలకు సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించి సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, పుష్పలంకరణ ,విష్ణు పారాయణం, అష్టోత్తర పూజ లు నిర్వహించి చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం మహామంగళహారతి ఇచ్చారు. మురడి ఆంజనేయస్వామికి సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం కుంకుమార్చన, బిళ్వార్చన, సహస్ర నామార్చన తదితర అభిషేకాలు నిర్వహించారు. ఆయా ఆలయాలకు ఆంధ్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 21 , 2024 | 07:11 AM