Share News

ఆర్బీకేల్లో ఎరువుల కొరత

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:18 AM

రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల కొరత కారణంగా రబీ సీజనలో పంటలు సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్బీకేల్లో ఎరువుల కొరత
ఎరువులు లేని సి.కొడిగేపల్లి ఆర్టీకే కేంద్రం

ఇబ్బందులు పడుతున్న రైతులు

మడకశిర రూరల్‌, జనవరి 27 : రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల కొరత కారణంగా రబీ సీజనలో పంటలు సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 18 రైతు భరోసాకేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మండలంలోని రైతులు రబీలో బావులు, బోర్ల కింద రాగి, మల్బరీ, మొక్కజొన్న పంటలు సాగుచేశారు. అయితే ఆయా పంటలు సాగుచేయడానికి అవసర మైన ఎరువులు రైతు భరోసా కేంద్రాలో అందుబాటులో లేవు. దీంతో ఎరువుల కోసం వ్యయప్రయాసల కోర్చి పట్టణానికి వెళ్లి అధిక ధరలతో ప్రైవే టు దుకాణాల్లో ఎరువులను కోనుగోలు చేయాల్సివస్తోందని రైతులు వాపోతు న్నారు. పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు లను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని, సబ్సిడీ ధరలతో అందస్తున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు పదే పదే చెబుతున్నా, అది మాటలకే పరిమితమైందని వాపోతున్నారు. బయట దుకాణాల్లో అధికధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. దీనికి తోడు పనులు వదులు కొని ఎరువుల కొనుగోలు కోసం పట్టణాలకు వెళ్లేందుకు సమయం వృథా అవుతోందని అంటున్నారు. దీంతో పాటు రవాణా ఖర్ఛులు భరించాల్సి వస్తోందని, అధిక శ్రమ తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రబీ సాగు కోసం రైతులకు కావలసిన ఎరువులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

రైతుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం - వెంకటరెడ్డి, సీ కోడిగేపల్లి

వైసీపీ ప్రభుత్వం రైతు కష్టాలను పట్టించుకోవడం లేదు. మాటలకే పరిమిత మైంది. రైతులకు పంటల సాగు కోసం స బ్సిడీతో విత్తనాలు, ఎరువులు ఆర్టీకేల్లో అం దుబాటులో ఉంటాయని అధికారులు అం టున్నారు. అది కేవలం మాటలకే పరి మితం. దీంతో చాలా మంది రైతులు పట్ట ణాలకు వెళిల ప్రైవేట్‌ దుకాణాల నుంచి అధిక ధరలతో ఎరువులను తెచ్చుకుంటు న్నారు. నేను రెండు ఎకరాల్లో రాగి, మరో రెండు ఎకరాల్లో చెరకు పంటలు సాగు చేశా. స్థానిక ఆర్బీకేలో యూరియా లేదు. దీంతో మడకశిరకు వెళ్లి అధిక ధరలతో కోనుగోలు చేసి, తెచ్చుకున్నా. ఆర్బీకేలో బస్తా యూరియా రూ.266 అయితే ప్రైవేట్‌ దుకాణాల్లో రూ.310తో కోనుగోలు చేశాను. ఇలా అయితే వైసీపీ ప్రభుత్వం రైతులకు ఎక్కడ సేవలు అందిస్తున్నట్లు.

ఆర్బీకేల్లో ఎరువులో అందుబాటులో ఉన్నాయి - తిమ్మప్ప, ఏఓ, మడకశిర

మండలంలో దాదాపు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నా యి. కొన్ని ఆర్బీకేల్లో ఎరువుల కొరత ఉంది. కొరత ఉన్న ఆర్బీకేలకు ఎరువుల కోసం ఇండెంట్‌ పెట్టాం

Updated Date - Jan 28 , 2024 | 12:18 AM