Share News

ఒకేరోజు ఏడుగురికి శస్త్రచికిత్స... నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:06 AM

పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 22వ తేదీన ఏడుగురు మహిళలకు వివిధ శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యానికి నాలుగురోజుల్లోనే ముగ్గురుమహిళలు మృతిచెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఒకేరోజు ఏడుగురికి శస్త్రచికిత్స...  నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి
ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న మృతుల బంధువులు

పావగడ ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

పావగడ, ఫిబ్రవరి26: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 22వ తేదీన ఏడుగురు మహిళలకు వివిధ శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యానికి నాలుగురోజుల్లోనే ముగ్గురుమహిళలు మృతిచెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈనెల 22న వీర్లగొంది గ్రామానికి చెందిన అనిత(30)కు పావగడ ఆసుపత్రిలో గైనకాలజి స్టు డాక్టర్‌ పూజ కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్స చేశారు. అయితే శస్త్ర చికిత్స చేసిన కొ న్ని గంటల్లోనే ఆమె ఆసుపత్రిలోనే మృతిచెందింది. అలాగే రాజవంతి గ్రామా నికి చెందిన అంజలి(20)అనే గర్భిణికి అదేడాక్టర్‌ సిజేరియన అపరేషన చేసి బిడ్డను బయటకు తీసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగుళూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ 24వ తేదీన మృతిచెందింది. అదేవిధంగా బ్యాడనూరుకు చెందిన నరసమ్మ (40) అనే మహిళకు ఆ డాక్టర్‌ గర్భకోశం అపరేషన చేశారు. వెంటనే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో బెంగుళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 25వతేదీన ఆమె కూడా మృతిచెం దింది. అపరేషన చేసిన నాలుగురోజుల్లోనే ముగ్గురు మహిళలు వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతిచెందారని మృతుల కుటుంబసభ్యులు పావగడ ప్రభుత్వా సుపత్రిలోనూ, ప్రధానరహదారిలోనూ కొన్ని గంటలు పాటు ఆందోళన చేపట్టారు. ముగ్గురు మహిళల మృతికి కారణమైన డాక్టర్‌ పూజను వైద్య వృత్తి నుంచి డిస్మస్‌ చేయాలని నినాదాలు చేశారు. ఈమేరకు పావగడ పోలీస్‌స్టేషనలో డాక్టర్‌ పూజపై కేసు నమోదైంది. ఇదిలాఉండగా తుముకూరు డీహెచఓ మంజునాథ్‌, ఇతర జిల్లా అధికారులు పావగడ ప్రభుత్వాసుపత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యులు కఠినచర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.

Updated Date - Feb 27 , 2024 | 12:06 AM