divotional వైభవంగా పల్లకీ సేవ
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:26 AM
మం డలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివా రం పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. తొలుత అర్చకులు ఆల యంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజ లు నిర్వహించారు.

ఉరవకొండ, జూలై 27: మం డలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివా రం పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. తొలుత అర్చకులు ఆల యంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజ లు నిర్వహించారు.
తర్వాత ఉత్సవ మూర్తిని పట్టువస్ర్తాలతో అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. మేళతాళాల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు పొందారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..