Share News

separate screens ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక స్ర్కీన్ల ఏర్పాటు

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:30 PM

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం చేపట్టిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి పట్టణంలో ప్రత్యేక స్ర్కీనను ఏర్పాటుచేశారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక స్ర్కీన ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణ స్వీకారాన్ని భారీగా టీడీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి తిలకించారు.

separate screens  ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక స్ర్కీన్ల ఏర్పాటు
కొత్తచెరువులో ప్రత్యేక స్ర్కీన ద్వారా ప్రమాణస్వీకారాన్ని తిలకిస్తున్న ప్రజలు, కూటమి శ్రేణులు

ధర్మవరం, జూన 12: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం చేపట్టిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి పట్టణంలో ప్రత్యేక స్ర్కీనను ఏర్పాటుచేశారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక స్ర్కీన ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణ స్వీకారాన్ని భారీగా టీడీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి తిలకించారు.


ఎన్టీఆర్‌ ఫ్యాన్స రాష్ట్ర కన్వీనర్‌ ఎల్‌.నరేంద్రచౌదరి ఆద్వర్యంలో టీడీపీ శ్రేణులు డప్పువాయిద్యాలతో, బైకు ర్యాలీ నిర్వహిస్తూ క్రీడామైదానికి చేరుకున్నారు. చంద్రబాబు సీఎంగా, సత్యకుమార్‌యాదవ్‌ రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కేరింతలు వేస్తూ బాణా సంచా కాల్చారు. వేలాది మంది తరలిరావడంతో కూటమి శ్రేణులు భోజన సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కమతం కాటమయ్య, గోనుగుంట్ల విజయ్‌కుమార్‌, పట్టణఅధ్యక్షుడు పరిశేసుధాకర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొత్తచెరువు/కదిరి: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి మండలకేంద్రంలో భారీ స్ర్కీన ఏర్పాటుచేయడంతో నాలుగురోడ్ల కూడలి జన సమూహంగామారింది. పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు కలిసి సంబరాలు చేసుకున్నారు. కదిరి పట్టణంలో కూడా సెల్ప్‌హెల్ప్‌ గ్రూపులతోపాటు పలువురు టీడీపీ నాయకులు చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని తిలకించడానికి ప్రధాన సర్కిళ్లలో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 12 , 2024 | 11:30 PM