Share News

జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:34 PM

స్థానిక ఎరా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా ఆర్చరీ ఎంపిక పోటీలు సోమవారంతో ముగిశాయి. ఎంపికైన క్రీడాకారుల వివరాలను జిల్లా ఆర్చరీ అసోసియేషన అధ్యక్ష, కార్యదర్శులు మురళీకృష్ణ, శివకుమార్‌ తెలిపారు.

జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక
ఎంపికైన జిల్లా ఆర్చరీ జట్టు

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 17: స్థానిక ఎరా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా ఆర్చరీ ఎంపిక పోటీలు సోమవారంతో ముగిశాయి. ఎంపికైన క్రీడాకారుల వివరాలను జిల్లా ఆర్చరీ అసోసియేషన అధ్యక్ష, కార్యదర్శులు మురళీకృష్ణ, శివకుమార్‌ తెలిపారు. అండర్‌-10, 13, 15 బాల, బాలికల క్యాటగిరీలలో మొత్తం 36 మంది ఎంపికయ్యారు. వీరు ఈనెల 22 నుంచి 24 వరకు విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. పాఠశాల చైర్మన చిరంజీవిరెడ్డి, ప్రిన్సిపాల్‌ జ్యోతిర్మయి, కరస్పాండెంట్‌ అరుణ్‌కుమార్‌ రెడ్డి ఈ క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన కోశాధికారి రవికుమార్‌, కోచలు నళిని, రాహుల్‌, లక్ష్మిదేవి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:34 PM