Share News

నామినేషన్ల కేంద్రం వద్ద 144 సెక్షన

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:35 AM

ధర్మవరం, ఏప్రిల్‌ 18: సార్వత్రిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన వెలువడింది. నోటిఫికేషన రోజు నుంచే నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన స్వీకరణ కేంద్రం (ఆర్డీఓ కార్యాలయం) వద్ద వందమీటర్ల పరిధి వరకు 144 సెక్షన అమలు చేశారు.

నామినేషన్ల కేంద్రం వద్ద 144 సెక్షన

ధర్మవరం, ఏప్రిల్‌ 18: సార్వత్రిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన వెలువడింది. నోటిఫికేషన రోజు నుంచే నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన స్వీకరణ కేంద్రం (ఆర్డీఓ కార్యాలయం) వద్ద వందమీటర్ల పరిధి వరకు 144 సెక్షన అమలు చేశారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వనటౌన సీఐసుబ్రమణ్యం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన కేంద్రానికి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అభ్యర్థితో సహా మొత్తం ఐదుగురికే నామినేషన కేంద్రానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా 100కు ఫోన చేస్తే తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడనున్నారు. ఇందుకు సంబంధించి సెంట్రల్‌ ఫోర్స్‌ కూడా అందుబాటులోఉండేలా ఏర్పాట్లు చేశారు. నామినేషన కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులు తమ వాహనాలను నిలిపివేసి నామినేషన పత్రాలు దాఖలు చేసి వెళ్లాల్సి ఉంటుంది.

Updated Date - Apr 19 , 2024 | 12:35 AM