School children should stay in school బడి ఈడు పిల్లలు.. బడిలోనే ఉండాలి
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:38 AM
బడిఈడు పిల్లలను బడిలో చేర్పిద్దామని ఎంఈఓలు సురే్‌షబాబు, రమణ పిలుపునిచ్చారు. నేను బడికి పోతా కార్యక్రమంపై మండలకేంద్రంలో బుధవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

ఓబుళదేవరచెరువు, జూన 26: బడిఈడు పిల్లలను బడిలో చేర్పిద్దామని ఎంఈఓలు సురే్‌షబాబు, రమణ పిలుపునిచ్చారు. నేను బడికి పోతా కార్యక్రమంపై మండలకేంద్రంలో బుధవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఈర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. ఇందులో ఎంఈఓలు పాల్గొని మాట్లాడారు. 6నుంచి 14 ఏళ్ల లోపు వయసు గల బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలన్నారు. బడి మధ్యలో మానేసిన పిల్లలను తల్లిదండ్రులు చొరవ తీసుకుని తిరిగి బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బూట్లు అందించడంతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు నరసింహులు, అన్సర్‌అలీ, జనార్ధన, చెన్నకేశవులు, కేశవ, వెంకటేష్, సుధాకర్, రిజ్వానా, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..