Share News

Sangameshwara Swamy: రేపటి నుంచి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - May 16 , 2024 | 12:32 AM

మండలకేంద్రంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో 17వ తేదీ శుక్రవారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్తలు కేసీ మనోహర్‌, నటరాజ్‌, నాగేంద్రప్రససాద్‌, ఫణీంద్ర, గిరీశ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Sangameshwara Swamy: రేపటి నుంచి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

కొత్తచెరువు, మే 15: మండలకేంద్రంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో 17వ తేదీ శుక్రవారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్తలు కేసీ మనోహర్‌, నటరాజ్‌, నాగేంద్రప్రససాద్‌, ఫణీంద్ర, గిరీశ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు మే నెలలో వైశాఖ మాసశుద్ధనవమి నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ క్రమంలో 17వ తేదీన సాయంత్రం ధ్వజారోహణం, 18న సాయంత్రం హంసవాహనంపై పార్వతీపరమేశ్వర ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు, 19న సాయంత్రం బృంగి వాహనంపై, 20న సాయంత్రం శేషవాహనం , 21న సాయంత్రం నందివాహనంపై ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 22న సాయంత్రం 6గంటలకు పార్వతీపరమేశ్వరకల్యాణోత్సవం, 23న ఉదయం 10:30గంటలక స్వామి రథోత్సవం జరుగుతుందన్నారు. 24న రాత్రి 7గంటలకు పార్వేట, 25న రాత్రి 9గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం, ఉయ్యాల సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వారు పేర్కొన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 16 , 2024 | 12:32 AM