TDP : రెండో రోజూ అదే సంబరం
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:28 AM
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉహించిన దాని కంటే అత్యధిక స్ఠానాలు సాధించి చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్య మంత్రి కాబోతున్నారన్న ఉత్సాహంతో నియోజకవర్గవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందడంతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఉత్సా హంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండో రోజు గురువారం కూడా సంబరా లు జరుపుకొన్నారు.

మడకశిర టౌన, జూన6: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉహించిన దాని కంటే అత్యధిక స్ఠానాలు సాధించి చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్య మంత్రి కాబోతున్నారన్న ఉత్సాహంతో నియోజకవర్గవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందడంతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఉత్సా హంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండో రోజు గురువారం కూడా సంబరా లు జరుపుకొన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమలతిప్పేస్వామి ఆధ్వ ర్యంలో పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు చంద్రశేఖర్, అసెంబ్లీ ఇనచార్జ ఆర్‌వీ గుప్తా, నాయకులు శ్రీకాంత,నారాయణప్ప, బానుప్రకాష్ తదితరులతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుండుమలకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలి పారు. సమష్ఠి కృషితో విజయం సాధించామని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అనేక మంది మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....