Share News

శంభో శంకర... హరహర మహాదేవ..!

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:03 AM

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించు కొని శివాలయాలతో పాటు ఇతర ఆలయాలు శుక్రవారం భక్తులతో కిక్కిరిశాయి.

శంభో శంకర... హరహర మహాదేవ..!
విశేష అలంకరణలో హెంజేరు సిద్దేశ్వరస్వామి

ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ

భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించు కొని శివాలయాలతో పాటు ఇతర ఆలయాలు శుక్రవారం భక్తులతో కిక్కిరిశాయి. హర హర మహాదేవ శంభో శంకర అనే శివనామ ప్మరణ తో మార్మోగాయి. హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించా రు. భక్తులు ఉపవాస దీక్షతో మహాదేవుడిని ద ర్శించుకున్నారు. పెనుకొండ ఐముక్తేశ్వరస్వామి ఆలయంలో గిరిజా కల్యాణమహోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. ఉదయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, టీడీపీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గోరంట్లలోని సోమేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని శివమాల ధారులు ప్రత్యేక రథంపై నగరోత్సవం నిర్వహించారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన అమరాపురం మండల పరిధిలోని హేమావతి హెంజేరు సిద్దేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురష్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ మహాశివరాత్రిని పురష్కరించుకోని హెంజేరు సిద్దేశ్వరస్వామి ఆల యంలో కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు ని ర్వహిం చారు. ఈ ఏడాది అందరూ సంతోషంగా ఉండాలని పంటలు బాగా పండాలని పూజలు చేయించినట్లు తెలిపారు. ఆయా ఆలయా ల్లో భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. రాత్రికి భక్తుల జాగరణ నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 12:03 AM