Share News

మావయ్యా.. రెగ్యులర్‌ చెయ్యవయ్యా..!

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:53 PM

‘మావయ్యా.. మా అమ్మ, నాన్న ఉద్యోగాలను రెగ్యులర్‌ చెయ్యండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి’ అని సమగ్ర శిక్ష ఉద్యోగుల పిల్లలు సీఎం జగన చిత్రపటానికి వినతి పత్రాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె 13వ రోజు కొనసాగింది. కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి తల్లిదండ్రులతో వచ్చిన పలువురు చిన్నారులు సీఎం జగన చిత్రపటానికి వినతిపత్రాలు అందించారు.

మావయ్యా.. రెగ్యులర్‌ చెయ్యవయ్యా..!
నిరసన వ్యక్తం చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు

జగన చిత్రపటానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల పిల్లల వినతి

అనంతపురం విద్య, జనవరి 1: ‘మావయ్యా.. మా అమ్మ, నాన్న ఉద్యోగాలను రెగ్యులర్‌ చెయ్యండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి’ అని సమగ్ర శిక్ష ఉద్యోగుల పిల్లలు సీఎం జగన చిత్రపటానికి వినతి పత్రాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె 13వ రోజు కొనసాగింది. కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి తల్లిదండ్రులతో వచ్చిన పలువురు చిన్నారులు సీఎం జగన చిత్రపటానికి వినతిపత్రాలు అందించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమ తల్లిదండ్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమగ్రశిక్ష ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు కొనసాగించారు. జనసేన మహిళా విభాగం రాయలసీమ కో ఆర్డినేటర్‌ పెండాల్య శ్రీలత, పీడీ అండ్‌ పీఈటీ అసోసియేషన జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప తదితరులు ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడటం సరికాదని జగనను విమర్శించారు. ఉద్యోగులను ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన విజయ్‌, నాయకులు అంబరీష్‌, మోహనబాబు, అంజనారాజు, రాజారెడ్డి భాస్కర్‌, దాదావలి, నారాయణరెడ్డి, ఆంజనేయులు, సాయి, రాజశేఖర్‌, నాగరత్న, కమల కుమారి, సునీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:54 PM