Share News

SALARY : నాలుగు నెలలుగా అందని జీతాలు

ABN , Publish Date - May 19 , 2024 | 12:08 AM

వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి సేవలు చేసేది న ర్సులు, ఎఫ్‌ఎనఓ,లు ఎంఎనఓలు, శానిటేష్‌, సిబ్బంది. మరి అలాంటి సిబ్బం దికే ఇబ్బంది వచ్చినా ఎవరితో చెప్పుకో వాలో అర్థం కాని పరిస్థితి స్థానిక ప్రభు త్వాసుపత్రిలో నెలకొంది. హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది అవస్థలు వర్ణనాతీతం. నాలుగు నెలలుగా జీతాలు అందించకపోడంతో వారు ఆవేద న చెందుతున్నారు.

SALARY : నాలుగు నెలలుగా అందని జీతాలు
Hindupuram Government Hospital

ఆవేదనలో నర్సులు, ఎఫ్‌ఎనఓ, ఎంఎనఓ, శానిటేషన సిబ్బంది

హిందూపురం అర్బన, మే 18: వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి సేవలు చేసేది న ర్సులు, ఎఫ్‌ఎనఓ,లు ఎంఎనఓలు, శానిటేష్‌, సిబ్బంది. మరి అలాంటి సిబ్బం దికే ఇబ్బంది వచ్చినా ఎవరితో చెప్పుకో వాలో అర్థం కాని పరిస్థితి స్థానిక ప్రభు త్వాసుపత్రిలో నెలకొంది. హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది అవస్థలు వర్ణనాతీతం. నాలుగు నెలలుగా జీతాలు అందించకపోడంతో కటుంబ పోషణ ఎలా పోషించాలని వారు ఆవేద న చెందుతున్నారు. ఎఫ్‌ఎనఓలు, ఎంఎనఓలు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఇచ్చే వేతనం నెలకు కేవలం రూ. 12 వేలు. అంటే రోజుకు రూ. 400. ఈ సొమ్ముతోనే నెల రోజుల పాటు కుటుంబాన్ని పోషించుకునే వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, నెలసరి ఆహార దినుసులకు ఈ ఆదాయం ఏ మాత్రం చాలదు. దీంతో పాటు ఏవైనా సమస్యలు వస్తే ఇక వారు అప్పులు చేయక తప్పదు. చేసినా తీర్చుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలుపుతున్నారు. నిత్యవసర దుకాణాల్లో ఇప్పటికే చాల వరకు అప్పు ఉన్నట్లు చెబుతున్నారు. అప్పు పేరుకుపోవడంతో ఇక పాత అప్పు కడితే కానీ కొత్త అప్పు ఇవ్వలేమని దుకాణాల యజమానులు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. ఇకపై పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శానిటేషన పని చేసే తమకు కూడా వైసీపీ ప్రభుత్వంలో జీతాలు రాలేదంటే ఎంత దౌర్బాగ్యమని ఆగ్రహిస్తున్నారు.

Updated Date - May 19 , 2024 | 12:08 AM