Share News

విద్యార్థులకు పరుగు పందెం పోటీలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:24 PM

పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో ఆత్మీయ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం పరుగు పందెం పోటీలు నిర్వహించారు.

విద్యార్థులకు పరుగు పందెం పోటీలు
విజేత విద్యార్థులతో ఆత్మయ ట్రస్టు సభ్యులు, ఉపాధ్యాయులు

కొత్తచెరువు, ఆగస్టు 21 : పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో ఆత్మీయ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం పరుగు పందెం పోటీలు నిర్వహించారు. అండర్‌-14, 17 విభాగాలల్లో 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి ప్రారంభించిన ఈ పోటీల్లో 265 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేత విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్‌ను డీఈఓ అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఎంఈఓలు జానరెడ్డప్ప, జయచంద్ర, ఆత్మీయట్రస్టు చైర్మన శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్‌, టోర్నమెంట్‌ కన్వీనర్‌ వెంకటరమణ, ఏఎంఓ మహేం ద్రారెడ్డి, ఏపీటీఎఫ్‌ 1938 అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, యూటీఎఫ్‌ నాయకులు లక్ష్మీనారాయణ, బాబు, మురళి, చాంద్‌బాషా, నగేశ, కిష్టప్ప, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:24 PM