Share News

suicide ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Oct 07 , 2024 | 12:40 AM

పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఎం రహంతుల్లా(55) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక 60 అడుగుల రోడ్డులోని రాయల్‌ సర్కిల్‌ వద్ద నివాసముంటున్న రహంతుల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

 suicide ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

గుంతకల్లుటౌన, అక్టోబరు 6: పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఎం రహంతుల్లా(55) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక 60 అడుగుల రోడ్డులోని రాయల్‌ సర్కిల్‌ వద్ద నివాసముంటున్న రహంతుల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.


పది నెలల క్రితం అతడికి పక్షపాతం వచ్చింది. పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. పది నెలల నుంచి సిక్‌ లీవ్‌లో ఉన్నాడు. కాగా శనివారం సాయంత్రం 5గంటలకు వాకింగ్‌ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియరాలేదు. కాగా ఆదివారం ఉదయం మండలంలోని పాతకొత్త చెరువు గ్రామ సమీపంలోని దర్గా సమీపంలో రేకుల షెడ్‌లోని పైపునకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్థులు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఽఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు విషయం తెలిపారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఏఎ్‌సఐ శ్రీనివాసులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 07 , 2024 | 12:40 AM