అయోధ్యకు ఆర్టీసీ బస్సుయాత్ర
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:34 PM
ఏపీఎస్ ఆర్టీసీ హిందూపురం డిపో ఆధ్వర్యంలో అయోఽధ్య, కాశీ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడప నున్నారు. ఎనిమిది రోజుల యాత్రలో 14 పుణ్యక్షేత్రాలు, పుణ్య నదీ స్నానాలు ఉంటాయని డిపో మేనేజర్ శ్రీకాంత బుధవారం ప్రకటించారు.

హిందూపురం అర్బన, జూన 12: ఏపీఎస్ ఆర్టీసీ హిందూపురం డిపో ఆధ్వర్యంలో అయోఽధ్య, కాశీ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడప నున్నారు. ఎనిమిది రోజుల యాత్రలో 14 పుణ్యక్షేత్రాలు, పుణ్య నదీ స్నానాలు ఉంటాయని డిపో మేనేజర్ శ్రీకాంత బుధవారం ప్రకటించారు. హిందూపురం నుంచి ఈ నెల 24, జూలై 12, ఆగస్టు 9తేదీల్లో మూడుసార్లు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. మొదట హైదరాబాద్ శంషాబాద్ వద్ద చిన్నజీయర్ స్వామీజీ నిర్మించిన రామానుజచార్యుల ఆలయం, యాదగిరిగుట్ట, నరసింహస్వామి దేవాలయం అక్కడ నుంచి నిజామాబాద్ బాసర సరస్వతీ దేవాలయం, అలహాబాద్ ప్రయాగ్ రాజ్‌గంగ, యమున, సరస్వతీ పుణ్యనదుల నదీ స్నానాలు, అయోధ్య శ్రీబాలరాముడి దర్శనం, సీతాదేవి ఇల్లు, జనకమహారాజ్‌కోట, అనంతరం కాశీలోని విశ్వనాథుని దర్శనం, విశాలాక్షమ్మ దర్శనం, గంగానదీ పుణ్యతీర్థస్నానం, కాలబైరవ దర్శనం, విశాఖ పట్నం రామకృష్ణ బీచ, కైలాసగిరి, సింహాచలం అప్పన్న దర్శనం, అన్నవరం, సత్యనారాయణస్వామి దర్శనం, ద్వారక తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, అన్నమయ్య క్షేత్రం, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం, అమరావతి, అమరేశ్వరుని దర్శనం, కోటప్పకొండ శ్రీపరమేశ్వర లింగదర్శనం, శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామి దర్శనం, యాగంటి బసవన్న దర్శనం చేయించి హిందూపురంతో యాత్ర ముగుస్తుందన్నారు. 14 రోజుల యాత్రకు ధర కేవలం రూ. 8,500 ఉంటుందన్నారు. వంటవారిని ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందని ఆహార దినుసులు బస్సులో యాత్రికులు అందించాలన్నారు. విడిది సమయంలో యాత్రికులే ఖర్చులు భరించాలన్నారు. యాత్రకు వెళ్లదలచిన వారు రిజర్వు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9440834715, 7382863007, 73828 61308ను సంప్రదించాలన్నారు.